NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. మాకాల సత్యనారాయణ ను అభినందించిన పెనమలూరు ఎమ్మెల్యే

1 min read

విజయవాడ , న్యూస్​ నేడు    : అంతర్జాతీయ యోగ డే ఉత్సవాలను 21 రోజులపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిట్నెస్ మంత్ర అవగాహన సదస్సులు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసినందుకు మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ చెన్నై ఆయుష్ చేత జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ‘ఉత్తమ సహజ వైద్యుడు అవార్డు ‘పొందినందుకు కానూరుకు చెందిన డాక్టర్ మాకాల సత్యనారాయణ ను పెనమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ . అభినందించారు. యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ను ప్రభుత్వం కూడా తగు ఉత్తర్వులతో మోడీ ఫిట్నెస్ మంత్ర ప్రచారానికి సహకారం అందించిన విషయం విధితమే.డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ తమ సంస్థ యోగ శక్తి సాధన సమితి కార్యక్రమాలకు హితోదికంగా సాయం చేస్తున్న రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలకు మరియు స్థానిక పెనమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author