PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుమ్ము రేపుతున్న అజిత్‌

1 min read

సినిమా డెస్క్​ : కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘వలిమై’. హెచ్.వినోద్ దర్శకుడు. అజిత్‌ రెండేళ్ల క్రితం ‘పింక్’ రీమేక్ ‘నెర్కొండ పార్వై’ లో కనిపించారు. మళ్లీ ఇదే కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఎప్పుడెప్పుడు అజిత్ లుక్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ నిన్న ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో అజిత్ హ్యాండ్సమ్ లుక్ తో పాటు యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. పవర్ అనేది అప్పటి మన స్టేట్ ఆఫ్ మైండ్‌ని బట్టి ఉంటుంది అంటూ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్‌‌గా ఈ సినిమా ఉండబోతుందని ఈ మోషన్ పోస్టర్‌‌ ద్వారా రివీల్ చేశారు. ఇందులో డూప్ లేకుండా అజిత్ స్వయంగా చేసిన బైక్ సీన్స్ థ్రిల్ చేస్తాయంటున్నారు మేకర్స్. టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. హ్యూమా ఖురేషి హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీకపూర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.

About Author