NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ఆర్ఆర్ఆర్’ గర్జన

1 min read

సినిమా డెస్క్​: డైరెక్టర్‌‌ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మేకింగ్‌ విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదట. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. సిటీలో షూటింగ్ ముగిశాక టీమ్‌ విదేశీ లొకేషన్స్ కి వెళ్తుందట. ఇక ఈ చిత్రంలో ప్రతి పోరాట సన్నివేశం ప్రతీదీ స్పెషల్ గా ఉండనుందట. అయితే ఈ మూవీ నుంచి ఎప్పుడు ఏ పోస్టర్‌‌ వస్తుందా , ఎలాంటి అప్‌డేట్‌ వస్తుందో అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఇందుకు సమాధానంగా రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తయ్యిందంటూ స్వీట్‌ న్యూస్‌ తెలిపారు జక్కన్న. దాంతో పాటు ఎన్టీఆర్‌‌, చరణ్లు బైక్‌పై వెళ్తున్న ఫోటోతో అభిమానుల్లో జోష్ నింపిన రాజమౌళి తాజాగా మరో అప్టేట్‌ ఇచ్చారు. ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ పేరుతో మూవీ సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈనెల 15న ఉదయం 11 గంటలకు ఈ వీడియో రాబోతోంది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ని విడుదల చేశారు. చారిత్రక వీరులైన కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇందులో పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్, రామ్ చరణ్‌ సరసన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్ కీలకపాత్రల్లో పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

About Author