రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలి
1 min readధాన్యం నాణ్యత, పరిమాణం, తేమశాతంలో ఎలాంటి తేడా లేకుండా పక్కా ప్రణాళికతో ధాన్యం సేకరణ
సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జెసి పి. ధాత్రిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ప్రణాళికతో రైతులు సంతృప్తి చెందేలా ధాన్యం సేకరించేందుకు సంబంధిత శాఖల అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, పౌర సరఫరాలు, రైతులు, తహాశీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు, ట్రాన్స్ పోర్టర్లు, తదితరులతో ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికలో భాగముగా పాటించవలసిన ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సుమారు 5.60 లక్షల మెట్రిక్ టన్నులధాన్యం దిగుబడి రావచ్చని అంచనా ఉండగా అందులో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో వరి పండే ప్రతీ గ్రామంలో దిగుబడి అంచనా ప్రకారం 3 కేటగిరీలు చేసి 247 ధాన్యం రైతు సేవాకేంద్రాలను క్లస్టరింగ్ ద్వారా కొనుగోలు కేంద్రాలుగు గుర్తించడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతర పర్యవేక్షణ ఎంతో అవసరమన్నారు. అక్టోబరు 2వ వారం నుంచి ప్రారంభమై ఫిబ్రవరి నాటికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగుస్తుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆయా నెలల్లో ఎంతమేర ధాన్యం వస్తుంది అంచనా వేసి అందుకు అనుగుణంగా ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. దళారుల నుండి మోసపోకుండా రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునేలా రైతులను అవగాహన పరచాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మద్ధతు ధర కొనుగోలు కేంద్రాల వివరాలపై రైతులకు అవగాహన పరచాలన్నారు. ధాన్యం నాణ్యత, పరిమాణం, తేమశాతంలో ఎలాంటి తేడా లేకుండా సజావుగు ఉండాలాగా పక్కా ప్రణాళిక అమలు చేయాలన్నారు. రైతులకు అనువైన విధంగా ధాన్యం సేకేరణ కేంద్రాలను రైస్ మిల్లులకు సమన్వయం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, గోనెసంచులు, వేయింగ్ మిషన్లు, తేమశాతం కొలిచే పరికరాలు తదితర వంటి వాటిని సిద్దంగా ఉంచుకోవాలన్నారు. రైస్ మిల్లుల్లో యంత్రాలు కెపాసిటీ, పనితీరు, గోడౌన్ల నిల్వ, అగ్నిమాపక నియంత్రణ చర్యలు, సంబంధిత అంశాలను సంబంధిత అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లుగా ఎటువంటి ఆలస్యం లేకుండా రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం సేకరణలో రైతులు, మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ధాన్యం సేకరణకు జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్, రెవిన్యూ డివిజనల్ అధికారులు, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రోలజీ, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి, ప్రెసిడెంట్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఇతర సంబందిత విభాగాల అధికారులతో జిల్లా స్టాయి కమిటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధముగా డివిజన్, మండల , గ్రామ స్థాయిలోధాన్యం సేకరణ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఖరీఫ్ లో ధాన్యంను క్వింటాలుకు కామన్ రకమును రూ 2,300 మరియు గ్రేడ్ ఏ రకమును రూ. 2,320 చొప్పున ప్రభుత్వంవారు (కనీస మద్దతు ధరకు) కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఈ పంట నమోదును త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. రైతులకు ధాన్యం కొనుగలునకు అవసరమైన గోనె సంచులు మరియు రవాణా వాహనాలు, సమకూర్చి రైతుల సౌలభ్యం కొరకు ధాన్యమును రైతుల యొక్క కళ్ళాల వద్ద నుండే సేకరించి ర్యాండమైజేషన్ పధ్దతిలో కాకుండా సమీప రైస్ మిల్లులకు ధాన్యమును తరిలించుట ద్వారా కోనుగోలు చేయబడుతుందన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్ధ మేనేజరు కె. మంజూ భార్గవి, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్ కె. హబీబ్ బాషా, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఉప రవాణా కమీషనరు ఎస్. శాంతకుమారి, డిసిఓ శ్రీనివాస్, మార్కెటింగ్ ఎడి గుప్తా, రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులు, ట్రాన్స్ పోర్ట్ అసోషియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.