అక్టోబర్ నాటికి అర్హులందరికీ స్వగృహ యోగం కల్పించేందుకు కృషి చేస్తున్నాం
1 min read
ఏలూరు ఎమ్మెల్యే బుజ్జి చంటి
2వ డివిజన్ లో సుపరిపాలనలో తొలి కార్యక్రమం
అభివృద్ధి,సంక్షేమం కరపత్రాలతో ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ నాటికి అర్హులందరికీ స్వగృహయోగం కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అర్థవంతంగా కొనసాగుతోంది. ఇదేక్రమంలో మంగళవారం స్థానిక 2వ డివిజన్లో నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని ఇంటింటికీ వెళ్ళిన ఆయన కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను అందించీ,వారు పొందిన లబ్దిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పథకాలు సక్రమంగా అందుతున్నదీ,,, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటూ స్థానిక సమస్యలను కూడా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని రోడ్లు, డ్రైన్ల సమస్యను స్థానికులు తెలుపుగా,,, ఆ సమస్యలను స్వయంగా పరిశీలించీ, పరిష్కారమార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ 2వ డివిజన్లో గత వైసిపి ప్రభుత్వ ఐదేళ్ళ కాలంలో రోడ్ల అభివృద్ధి జరగలేదన్నారు. దీంతో డివిజన్లో 40 రోడ్ల వరకూ పాడైన పరిస్థితి నెలకొందనీ, వర్షం కురిస్తే స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో యుద్ధప్రాతిపదికన 5రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని, అలాగే సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా కచ్చా డ్రైన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రానున్న కాలంలో సమస్యలన్నింటికీ పరిష్కారమార్గాలు చూపుతామని ఆయన భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏపి మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు,ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు.
