ప్రతి అడుగు ప్రగతి కొరకు- ప్రతి పథకం పేదల అభ్యున్నతి కొరకు
1 min read
సుపరిపాలనాలో తొలి అడుగు-సుపరి పాలనతోటే ఇంటింటికి వెలుగు
బీసీ వెల్ఫేర్ చేనేతజౌళి శాఖ మంత్రి సంజీవరెడ్డి గారి సవితమ్మ
చెన్నూరు , న్యూస్ నేడు : ప్రతి అడుగు ప్రగతి పథం వైపు దూసుకెళుతూ, ప్రతి పథకం పేద వారి ఇంటిలో వెలుగు నింపడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆదిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని, సుపరిపాలనలో ఇది తొలి అడుగు మాత్రమేనని బీసీ వెల్ఫేర్ చేనేత జౌళిశాఖ మంత్రి( జిల్లా ఇన్చార్జి మంత్రి) సంజీవరెడ్డి గారి సవితమ్మ అన్నారు. మంగళవారం ఉదయం చెన్నూరు బెస్త కాలనీ నందు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తో కలిసి ఆమె పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో ఇంటింటి వెళ్లి మహిళలను పలకరించి కూటమి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు .ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా సమస్యలు ఉంటే తమకు చెప్పాలని ఆమె గ్రామస్తులను అడగడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక విజన్ కలిగిన నాయకుడని ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆమె అన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వాన్ని ఆమె తెలిపారు. గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది పిల్లలు పాఠశాలకు వెళితే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్పి, అధికారంలోకి రాగానే ఒకరికి అమ్మ ఒడి అని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆపరేటివ్ అధికారి వెంకటసుబ్బయ్య, టిడిపి నాయకులు కల్లూరు విజయభాస్కర్ రెడ్డి, ఇంది రెడ్డి శివారెడ్డి, రామన శ్రీలక్ష్మి, తాడిగొట్ల వెంకటసుబ్బారెడ్డి (బుజ్జన్న), గుమ్మల్ల మల్లికార్జున్రెడ్డి, పొట్టి పాటి హనుమాన్ రెడ్డి , పొట్టి పాటి జగదీశ్వర్ రెడ్డి, సీతమ్మ గారి శ్రీకాంత్ రెడ్డి, ఆకుల బాబు, ఆకుల చలపతి , ముండ్ల శ్రీనివాసులు రెడ్డి, షబ్బీర్, కుంచం రామకృష్ణారెడ్డి , ఆవుల బసిరెడ్డి, ఆవుల పవన్ కుమార్ రెడ్డి, పాలగిరి పెద్ద సుబ్బారెడ్డి, పాలగిరి సుదర్శన్ రెడ్డి, వేల్పుల సుబ్రహ్మణ్యం, యామాల మణికంఠ, తాసిల్దార్ సరస్వతి, ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.