ఘనంగా మెగా తల్లిదండ్రుల సమావేశం
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ప్యాపిలిలో మెగా తల్లిదండ్రుల సమావేశం ఘనంగా నిర్వహించారు.బాలుర పాఠశాలలో గురువారం మెగా తల్లిదండ్రుల సమావేశం ఎంతో ఉత్సాహభరితంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయురాలు పద్మబాయి అధ్యక్షత వహించారు.ఎంపీడీవో శ్రీ శ్రీనివాసులు, ప్రత్యేక అధికారి శ్రీ హరినాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసులు మాట్లాడుతూ: పిల్లలు సెల్‌ఫోన్ల ప్రభావానికి లోనుకాకుండా, తల్లిదండ్రులు వారిని దూరంగా ఉంచాలి. విద్యపై ఆసక్తిని పెంపొందించేలా తీర్చిదిద్దాలి” అని సూచించారు.ఈ సమావేశానికి తేదేపా నాయకులు ఖాజా పీర్, ఎక్స్ ఎంపిపి శ్రీనివాసులు , పూర్వ విద్యార్థి చల్ల వీర తదితర హాజరై, విద్య ప్రాధాన్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు నందీశ్వర రెడ్డి , కిరణ్,సువర్ణ ,సుదర్శన్ రెడ్డి, రమేశ్, శేఖర్,నాయుడు,శ్రీదేవి, నాసిర్ ఖాన్, రాజేంద్ర, శ్రీనివాసులు,నాగరాజు,సుజాత, కల్యాణి, కృష్ణవేణి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.