NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిల్లల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకమం: ఎమ్మెల్యే

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: డోన్ పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో మెగా పీటీఎం 2.0 (మెగా పేరెంట్ టీచర్ మీటింగ్) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పిల్లల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ఈ తరహా సమావేశాలు పాలనలో పారదర్శకతను తీసుకువచ్చేలా ఉంటాయని ఎమ్మెల్యే  పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా అభివృద్ధి చర్యలకు నిదర్శనంగా నిలుస్తుందని ఎమ్మెల్యే  తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *