NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో రైతులందరికీ సాగునీరు అందిస్తాం

1 min read

సీజనల్ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి

రైతులు నీటిని వృధా చేయరాదు

రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మరియు

రాష్ట్ర న్యాయ, మైనార్టీ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్

రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలి

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లాలో పంటలు సాగు చేసే ప్రతి రైతుకు సాగునూరు అందించి రైతుల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందనిరాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మరియురాష్ట్ర న్యాయ, మైనార్టీ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ లు పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్ నందు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆధ్వర్యంలో(ఖరీఫ్: 2025-26), జిల్లా  నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి,  బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, గిత్త జయసూర్య, ఇతర జిల్లాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ ఎండి ఫరూక్ లు మాట్లాడుతూ…. ఖరీఫ్, 2025-26, సంవత్సరానికి  సంబంధించి నంద్యాల జిల్లాలో పంటలు సాగు చేసే ప్రతి రైతుకు సాగునీరు అందించి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఏదైతే ఈ సీజన్ కు ఇవ్వవలసిన నీరు కేసీ కెనాల్, ఎస్ ఆర్ బి సి, తెలుగు గంగా ప్రాజెక్టుల ద్వారా మిగతా ప్రాంతాలలో ఎక్కడెక్కడ నీరు వదలాలి అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి ముందస్తు ఆలోచన వల్ల రైతులకు నీరు వదిలే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. నేడు ఐఎ బి సమావేశంలో  ముఖ్యంగా వాటర్ యూజర్ అసోసియేషన్ సభ్యులు కొత్తగా వచ్చిన తర్వాత వారి పర్యవేక్షణలోనే నీటికి సంబంధించిన పనులన్నీ చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఉండే రైతులు ఎవరు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రతి  రైతు చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారని ఇలాంటి మంచి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో రాయలసీమ ప్రాంతానికి పుష్కలంగా నీరు తెప్పించింది ఎన్టీ రామారావు , తర్వాత చంద్రబాబు నాయుడు గ అని గుర్తు చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ…. నీటిపారుదలశాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులకు సంబంధించిన నీటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా  ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. నంద్యాల జిల్లాలో ఏఐబి సమావేశంలో ప్రజా ప్రతినిధులు, రైతులు తెలియజేసిన సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరించి రైతులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతూ…. ఆళ్లగడ్డ కేసీ కెనాల్ కాలువ మీద శిల్ప వెంచర్ వేసి ఇరిగేషన్ ల్యాండ్ ను దుర్వినియోగం చేయడం జరిగిందని వెంచర్ వేసిన వారిపై ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో లస్కర్ల సిబ్బంది కొరత వల్ల రైతులకు సక్రమంగా నీరు అందించలేకపోతున్నామని లస్కర్ల పోస్టులను భర్తీ చేసి సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ని కోరారు. ఇరిగేషన్ అధికారులు రైతులతో సోదర భావంతో మెలిగి రైతులకు సంబంధించిన నీటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల సాగు నీటి సంఘాల నాయకులు, రైతులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *