PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ 100 రోజుల పాల‌న‌ను ప్ర‌జ‌లు మెచ్చుకుంటున్నారు..

1 min read

రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్

కర్నూలు సెప్టెంబర్ 22 :- నూతన ప్రభుత్వ 100 రోజుల పాల‌న‌ను ప్రజ‌లు మెచ్చుకుంటున్నారని

రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆదివారం స్థానిక ఉదయం 47వ వార్దు ధర్మపేట లోని సచివాలయము వద్ద సాయంత్రం 13 వ వార్దు లోని బంగారు పేట శ్రీరామ టాకీ స్ సమీపంలో  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్,జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుత గ‌త ఐదేళ్లలో స‌ర్వ‌నాశ‌న‌మైన రాష్ట్రాన్ని తమ ప్రభుత్వం వ‌చ్చాక‌ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు గాడిలో పెడుతున్నార‌ని చెప్పారు. గ‌డిచిన ఐదేళ్ల‌లో రాష్ట్రం అభివృద్ధిలో వెనుక‌బ‌డిపోయింద‌న్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు విజ‌న‌రీతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశ‌లో ముందుకు వెళుతున్న‌ట్లు చెప్పారు. ప్రభుత్వ వంద రోజుల పాల‌న‌లో ఎన్నో కార్యక్రమాల‌కు శ్రీకారం చుట్టిన‌ట్లు పేర్కొన్నారు. మాట ఇచ్చిన విధంగా పెన్షన్ రూ.4 వేలు చేశామ‌ని, డీఎస్సీ విడుద‌ల చేశామ‌న్నారు. పేద‌ల ఆక‌లి తీర్చే 175 అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేసి ప్ర‌జల ఆస్తుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించామ‌ని మంత్రి టి.జి భ‌ర‌త్ చెప్పారు. విజ‌య‌వాడ‌కు వ‌ర‌ద‌లు వ‌స్తే రాత్రింబ‌వ‌ళ్లు తేడా లేకుండా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌ష్ట‌ప‌డ్డార‌న్నారు. 100 రోజుల్లోనే ఇది మంచి ప్ర‌భుత్వం అని ప్ర‌జ‌లంద‌రూ చెప్పేలా త‌మ పాల‌న ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెర‌వేర్చుతూ ముందుకు వెళుతున్నామ‌న్నారు. ఓర్వక‌ల్లు ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింద‌న్నారు. రానున్న ఐదేళ్ల‌లో అక్క‌డ మౌలిక స‌దుపాయాలు క‌ల్పించి ప‌రిశ్ర‌మ‌లు తీసుకొస్తామ‌న్నారు. కర్నూలు నగరంలోని సమస్యలను పరిష్కరించి నగర రూపురేఖలు మారుస్తానని చెప్పారు. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తెస్తామన్నారు. ఇక ఎంతో ప‌విత్రమైన తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో గ‌తంలో క‌ల్తీ జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. అనంతరం ఇది మంచి ప్ర‌భుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, చేప‌ట్టిన‌ అభివృద్ధి పనుల గురించి వివ‌రించారు.జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి సంబంధించి వార్డు సభ  ఏర్పాటు చేసుకున్నాం, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన 100 రోజులలో చేసినటువంటి పనులను గురించి వాల్ పోస్టర్ విడుదల చేయడమైనది. ఇందులో ఆరు అంశాలు మెగా డీఎస్సీ, పింఛన్లు, ఉద్యోగులందరికీ ఒకటవ తేదీననే జీతాలు ఇవ్వడం గురించి, పేదలందరికీ ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వరదల సమయంలో ప్రభుత్వం చేపట్టిన విషయాలను గురించి తదితర అంశాలు తెలియజేసే వాల్ పోస్టర్  ను విడుదల చేయడమైనది. ఈ రెండు నెలలలో మన జిల్లాలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో రెండో స్థానంలో ఉన్నది , అన్న క్యాంటీన్ల విషయానికొస్తే మన నగరంలో ఇప్పటికే రెండు క్యాంటీన్లను ప్రారంభించుకోవడం జరిగింది. సోమవారం కూడా అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నామన్నారు. డిపార్ట్మెంట్ల వారిగా చూసుకుంటే అగ్రికల్చర్ పరంగా ఈ క్రాప్ బుకింగ్, ఎడ్యుకేషన్ పరంగా మన జిల్లాలో మంచి అచీవ్మెంట్ సాధించాం, 2047 నాటికి స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ గా ఎందుకు ఎంచుకున్నామంటే 2047 నాటికి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ డాక్యుమెంటును మనకు పంపించడం జరిగిందని, ఈ విజన్ డాక్యుమెంట్లను ఇంటింటికీ పంపించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 2047 నాటికి మనము మన పిల్లలు ఒక గ్లోబల్ సెషన్ గా ఎదగడం అంటే ప్రపంచంలో పోటీపడే విధంగా తయారు కావడం, 15 శాతం గ్రోత్ రేటును ఉండేలా ముందుకు తీసుకువెళ్లడం.2.5 మిలియన్ల డాలర్ల జీఎస్టీ ని సాధించడం. అది కాకుండా కాలుష్యాన్ని నియంత్రించడం గ్రీన్ ఎనర్జీని సాధించడం, విద్యుత్ వాహనాలను వినియోగించడం, ఇలాంటి కొన్ని గోల్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా కొన్ని రంగాలలో విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, వ్యవసాయము ఇలా అన్ని రంగాలలో కూడా మనము టార్గెట్ ను ఫిక్స్ చేసుకుంటాం. అవి గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో ప్రతి ఒక్కరు ఒక ప్రణాళికను ఏర్పరచుకోవాలని దీనికి సంబంధించి విజన్ డాక్యుమెంట్ మీకందరికీ ఇస్తే మీ దగ్గర సలహాలు సూచనలు తీసుకోవడానికి ఒక పాంప్లెట్ ఇస్తారు అందులో క్యూఆర్ కోడ్ ఇచ్చారు దానిని మొబైల్ ఫోన్ ద్వారా స్కానింగ్ చేస్తే ఫీడ్ బ్యాక్ ఫారం వస్తుంది దాని ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు అలా కాకుండా మాన్యువల్ గా కూడా మీరు ప్రొఫార్మ్ ను ఫిలప్ చేసి ఇవ్వచ్చు అన్నారు. వీటిని సైట్ లో పొందపరిచి ఈ సెప్టెంబర్ 30 వ తారీఖు నాటికి రడి చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలతో ఎన్జీవోల తో మాట్లాడి జిల్లాకు సంబంధించి ఒక విజన్ తయారు చేయడం జరుగుతుందన్నారు. వీటన్నిటిని మీకు తెలియజేయడానికి సలహాలు సూచనలు తెలుసుకోవడానికి ఈ వార్డ్ సభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డాక్యుమెంట్ను సిబ్బంది మీ అందరికీ ఇస్తారు వాటిని చదవండి అందులో గ్రామాలకు, జిల్లాలకు, పట్టణాలకు, రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు ఉంటాయి అన్నిటినీ జోడీకరించి  2024 నుండి 2029 వరకు ఒక ప్రణాళికను అంటే ఐదు సంవత్సరాల ప్రణాళికను. అట్లాగే 2047 నాటికి కూడా ఒక ప్లాను తయారు చేసుకుంటాం. దీన్ని అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లండి మీరందరూ భాగస్వాములు కండి మీ అందరి సూచనలు సలహాలతో మన జిల్లా అభివృద్ధికి ఒక ప్లాన్ తయారు చేసుకోవడం జరుగుతుంది అని జిల్లా కలెక్టర్ ప్రజలకు తెలియజేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే పింఛన్లను పెంచి ప్రతి నెలా 1వ తేదీ నాడే అందజేస్తుందని, మెగా డిఎస్సీ ద్వారా 16,347 మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పింస్తుందన్నారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరించడం గొప్ప కార్యక్రమం అన్నారు. అందులో కర్నూలు నగరంలో 5 అన్న క్యాంటీన్లు ఉన్నాయని, తద్వారా రూ.5 కే పేదలకు భోజనం లభిస్తుందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని, వాటితోనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. అందులో భాగంగానే వంద రోజుల్లోనే పూడికతీత పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. నగరంలో పూర్తిస్థాయిలో పూడికతీత పనులు చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం వన మహోత్సవం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రజలు కూడా సహకరించాలని, మొక్కలు పెంచడం, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించడం వంటివి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి సోమిశెట్టి వెంక‌టేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు పాల‌కుర్తి తిక్కారెడ్డి, నాగేశ్వర్ యాద‌వ్, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, స్థానిక నాయకులు, ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి,మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, వార్డు కార్పొరేటర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *