సూచీల జోరు.. లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు రోజంతా లాభాల్లో కొనసాగాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్ చివరి వరకు లాభాల జోరు కొనసాగించింది. వ్యాక్సినేషన్ లో పురోగతి, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు స్టాక్ మార్కెట్ ను లాభాల్లో కొనసాగేలా చేశాయి. సెన్సెక్స్ 379 పాయింట్ల లాభంతో 52,769 స్థాయి వద్ద ట్రేడింగ్ ముగియగా.. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 15,812 వద్ద ట్రేడింగ్ ముగించింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, మెటల్ షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది.