పేదలు నిస్సహాయులు పట్ల సేవాభావంతో ఉండాలి
1 min readప్రతి ఒక్కరూ సేవాభావంతో ఉండాలి
నరసాపురం ఆర్డీవో డి రాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామంలోని లెప్రసి కాలనీలో పేదలకు నర్సాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న రాజు పుట్టిన రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి స్వయంగా వడ్డించారు. బర్త్ డే కేకుని కట్ చేసి అందరికీ పంచారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల పుట్టినరోజు వేడుకలను ఈ కాలనీ వాసుల సమక్షంలో జరుపుకోవడం, వివిధ రూపాల్లో వారికి సేవలు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గతంలో శిథిలావస్థకు చేరిన ఈ కాలనీ అభివృద్ధికి తనవంతు కృషి చేశానని అన్నారు. అదేవిదంగా వారి జీవన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 35 కేజీల బియ్యం రేషన్ కార్డులను గతంలో మంజూరు చేశామని, వీరి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడినని రాజు అన్నారు. భవిష్యత్తులో కూడా మరింత సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు భావన నూకరాజు, ఆదరణ ట్రస్ట్ చైర్మన్ కృష్ణ భగవాన్, సీనియర్ జర్నలిస్టులు వార్త గోపి, దాసరి శ్రీను, మైలబత్తుల విజయ్ కుమార్, , మైలబత్తుల ప్రభాకర్, నల్లి ప్రసాద్, ఆరోగ్య వర్షిణి సంస్థ నాగిడి రాంబాబు, రావూరి శ్రీధర్ తదితరులు ఉన్నారు.