NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హీరో విజ‌య్ కు జ‌రిమానా… రియ‌ల్ హీరోగా నిలవండి : కోర్టు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : త‌మిళ హీరో విజయ్ కు మ‌ద్రాస్ హైకోర్టు జ‌రిమానా విధించింది. విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కేసులో న్యాయ‌స్థానం విజ‌య్ కు జ‌రిమానా విధించింది. ఇంగ్లండ్ నుంచి దిగుమ‌తి చేసుకున్న ఈ కారుకు ప‌న్ను క‌ట్టనందున ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా హై కోర్టు విధించింది. జ‌రిమానాను రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి స‌హాయ నిధికి జ‌మ చేయాల‌ని కోర్టు సూచించింది. సినిమాల్లో అవినీతి వ్యతిరేక పాత్రల్లో న‌టిస్తున్న హీరోలు పన్ను కట్టడంలో విఫ‌ల‌మ‌వుతున్నార‌ని హైకోర్టు న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. త‌మిళ హీరో పాల‌కులుగా గ‌తంలో ఉన్నార‌ని, అందువ‌ల్ల వారిని ప్రజ‌లు రియ‌ల్ హీరోలుగా చూస్తార‌ని అన్నారు. రీల్ హీరోలు.. రియ‌ల్ హీరోలుగా నిల‌వాని న్యాయ‌మూర్తి సూచించారు.

About Author