PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగ్గురి కంటే ఎక్కువ సంతానం ఉంటే.. ప‌థ‌కాలు క‌ట్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌ర్ణాట‌క ప్రభుత్వం జ‌నాభా నియంత్రణ‌కు క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ముగ్గురి కంటే అధిక సంతానం ఉంటే ప్రభుత్వ ప‌థ‌కాలు క‌ట్ చేయాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. త‌ద్వార జ‌నాభా నియంత్రణ చ‌ర్యలు అమలు చేయాల‌ని యోచిస్తోంది. ఈ మేర‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి సిటీ ర‌వి ట్వీట్ చేశారు. జ‌నాభా నియంత్రణ బిల్లును రాష్ట్రంలో అమ‌లు చేయడం ఖాయ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉత్తర‌ప్రదేశ్, అస్సాం కూడ ఇదే త‌ర‌హా జ‌నాభా నియంత్రణ చ‌ర్యలు అమ‌లు చేస్తున్నాయి.

About Author