మావోయిస్టు నేత లొంగుబాటు
1 min readపల్లె వెలుగు వెబ్ : మావోయిస్టు పార్టీ నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు కార్యక్రమాలపై విసుగు చెంది లొంగుబాటుకు రంజిత్ అనుమతి కోరారని డిజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పాఠశాల వయసు నుంచే రావుల రంజిత్ మావోయిస్టు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడని డిజిపి తెలిపారు. ప్రస్తుత మావోయిస్టు భావజాలంతో ఎలాంటి ఉపయోగంలేదని రంజిత్ అభిప్రాయమని డిజిపి అన్నారు. మిగిలిన మావోయిస్టులు కూడ లొంగిపోవాలని తమ ద్వార రంజిత్ కోరుతున్నారని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు.