లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నష్టాలతో ప్రారంభమైన సూచీలు లాభాల్లోకి పయనించాయి. నిఫ్టీ లాభాల్లో ట్రేడింగ్ ముగించగా.. బ్యాంక్ నిఫ్టీ స్వల్ప నష్టంతో ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 15, 853 స్థాయి వద్ద ట్రేడింగ్ ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 35,644 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఐటీ, టెక్నాలజీ, మెటల్, ఇండస్ట్రీయల్ రంగాల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ, సెన్సెక్స్ లాభాల్లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీలో స్వల్ప నష్టంతో ట్రేడింగ్ ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 74.59 వద్ద ముగిసింది.