75 ఏళ్ల స్వాతంత్ర్యం.. రాజద్రోహం చట్టం ఇంకా అవసరమా ?
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశ ద్రోహం ఓ వలస చట్టం. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడ ఈ చట్టం అవసరమా ? అంటూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలిస్తామన్న కోర్టు.. దీని పై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ చట్టంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, పేకాట ఆడేవారిపై కూడ రాజద్రోహం కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. రాజకీయ ప్రత్యర్థుల అణిచివేత కోసం దీనిని తప్పుగా ఉపయోగిస్తున్నారని అన్నారు. ఫ్యాక్షనిస్టులు ప్రత్యర్థులపై రాజద్రోహం మోపేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజద్రోహం సెక్షన్ 124-ఏ పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని అన్నారు. కొయ్యను మలిచేందుకు రంపం ఇస్తే.. అడవిని నాశనం చేసినట్టు ఉందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.