అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో..కానీ అక్రమ సంతానం ఉండదు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రపంచంలో అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో కానీ.. అక్రమ సంతానం ఉండదని కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పుట్టుకతో పిల్లలకు ఎలాంటి సంబంధం ఉండదని తెలిపింది. బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీలో పనిచేసే ఉద్యోగి 2014లో మరణించారు. ఈ నేపథ్యంలో తనకు తన తండ్రి ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆ వ్యక్తి రెండో కొడుకు సంతోష బెస్కాం ను కోరారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే .. రెండో భార్యను చేసుకోవడం చట్టవిరుద్ధమని, అలాంటిది రెండో భార్య సంతానానికి ఉద్యోగం ఇవ్వడం బెస్కాం నిబంధనలకు వ్యతిరేకమని బెస్కాం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కె. సంతోష హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లి,తండ్రి లేకుండా ప్రపంచలో పిల్లలెవరు పుట్టరని, పుట్టుకలో పిల్లల పాత్ర ఉండదని చెప్పింది. కాబట్టి అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో కానీ అక్రమ సంతానం ఉండరనే వాస్తవాన్ని చట్టం గుర్తించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.