‘నేతన్న హస్తం’లో అధికారుల చేతివాటం..
1 min read– నిజమైన లబ్ధిదారులకు మొండిచేయి
– మట్లిలో మగ్గం లేకపోయినా పథకం మంజూరు..!
పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి: వీరబల్లి మండలపరిధిలోని మట్లి గ్రామంలో తోగటపల్లి లో నేతన్న హస్తం పథకం అమలు చేయడంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిజమైన లబ్ధిదారులకు మొండిచేయి చూపి.. మగ్గం లేకపోయినా.. మదనపల్లి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్న వారికి నేతన్నహస్తం మంజూరు చేయడం ఏమిటని పలువురు చేనేతకార్మికులు ప్రశ్నిస్తున్నారు. 120 మందికార్మికులను లబ్ధిదారులుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ మగ్గాలపై పడుగు లేకపోవడంతో జిల్లా స్థాయి అధికారులు వెల్ఫేర్ ఆఫీసర్ ను మందలించారు. మగ్గాలపై పడుగు లేకుండా ఎలా నేతన్నహస్తం మంజూరు చేస్తామని మండిపడ్డారు. ఎక్కువగా బెంగళూరు, మదనపల్లె వాసులే పథకానికి అర్హులుగా ఎలా గుర్తిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో నివాసం ఉండి అర్హులైన చేనేత కార్మికులకు 24000 రూపాయలు వర్తించేలా చూడాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు వడ్డీ పొగడ పల్లెలు పరిశీలించి గ్రామంలో నివాసం ఉండే వారికే నేతన్న హస్తం మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.