వచ్చే నెలలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
1 min readపల్లెవెలుగు వెబ్ : జాబ్ క్యాలెండర్ లో ఇప్పటికే ప్రకటించిన పోస్టుల సంఖ్య పెంచుతున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 1, గ్రూప్ 2 సహా పలు విభాగాల్లో అదనంగా పోస్టులు జత చేసి వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాం బాబు తెలిపారు. ఇప్పటికే 1180 పోస్టులు గుర్తించామని, వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య ఇంకా రావాల్సి ఉందని, వచ్చే నెల ఆగస్టులో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. అభ్యర్థుల వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన వినతులు పరిశీలించి ప్రభుత్వానికి నోట్ పంపామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వయోపరిమితి పెంపు పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.