థియేటర్లకు 500 మీటర్ల అవతలే కాలేజీలు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీలో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాల ఏర్పాటుకు కొత్త నిబంధనల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేశారు. ఏపీ ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల నిబంధనలు-2021 పేరుతో దీన్ని విడుదల చేశారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా వీటిని రూపొందించారు. సినిమా థియేటర్లు, మద్యం దుకాణాలు, పబ్లిక్ ఫంక్షన్ హాళ్లకు 500 మీటర్ల దూరంలో కళాశాలలకు అనుమతి ఇవ్వరు. ప్రతి ఏడాది కొత్త కళాశాలల ఏర్పాటు అనుమతి ప్రక్రియ మార్చి 31 లోపు పూర్తీ చేస్తారు. కొత్త కళాశాలల ఏర్పాటుకు అవసరమయ్యే సర్వేను ఆగస్టు 31న చేపడతారు. సెప్టంబర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరిశీలన, యాజమాన్యాలకు సమాచారం అక్టోబర్ 31లోగా ఇస్తారు. అర్హత సాధించిన యాజమాన్యాలు జనవరి 31లోగా కార్పస్ ఫండ్ చెల్లించాలి. మార్చి 31లోగా అనుమతులిస్తారు. ప్రతి మూడేళ్లకోసారి కళాశాల ఏర్పాటుకు ఉన్న అవసరాలపై సమీక్ష నిర్వహిస్తారు.