NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓటీటీలోకి తమిళ లేడీ సూపర్‌‌ స్టార్‌‌

1 min read

సినిమా డెస్క్​: కోలీవుడ్‌లో లేడీ సూపర్‌ స్టార్‌‌గా రాణిస్తున్న నయనతార డిజిటల్‌ ఎంట్రీకి రెడీ అవుతోంది. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’ ప్రీక్వెల్‌లో నటించనుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్.. రాజమౌళి, ప్రసాద్ దేవినేనితో కలిసి ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని నిర్మిస్తోంది. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్టైల్ లో భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ వెబ్ సిరీస్‌లో నయనతార నటించనుందని లేటెస్ట్ టాక్. సెప్టెంబర్ నుండి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అవనుంది. అయితే ఈ సిరీస్‌ ఇప్పటికే కొంతభాగం షూటింగ్ చేశారు. కానీ అవుట్ పుట్‌ సరిగా రాని కారణంగా అసంతృప్తితో నెట్ ఫ్లిక్స్, దాన్ని పక్కన పెట్టేసి ఫ్రెష్ గా తిరిగి స్టార్ట్ చేయబోతోంది. సినిమాకి ఎంతో కీలకమైన యంగ్ శివగామి పాత్రకి వామిక గబ్బిని తీసుకున్నారు. కానీ నయనతారని ఏ పాత్రకి తీసుకోబోతున్నారు అనే విషయంపై క్లారిటీ రావలసి ఉంది. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇది స్ట్రీమ్ కానుంది.

About Author