NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘జ‌స్ట్ డ‌యిల్’ లో వాటా కొనుగోలుకు ‘రిలయ‌న్స్’ సిద్ధం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : వ్యాపార సంస్థల స‌మాచారం తెలిపే జ‌స్ట్ డ‌యిల్ కంపెనీలో వాటా కొనుగోలుకు రిల‌య‌న్స్ సిద్ధమైంది. జ‌స్ట్ డ‌యిల్ లో 41 శాతం వాటాను కొనుగోలు చేయ‌డానికి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ కు చెందిన రిల‌య‌న్స్ రిటైల్ వెంచ‌ర్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. సంస్థలోని ప్రమోట‌ర్ల నుంచి 40.95 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 3,497 కోట్లు ఖ‌ర్చు చేయ‌నుంది. జ‌స్ట్ డ‌యిల్ వ్యవ‌స్థాప‌కుడు వీఎస్ఎస్ మ‌ణి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కంపెనీను న‌డిపేందుకు ఒప్పందం కుదిరింది. ఆర్ఆర్ వీఎల్ కొనుగోలు చేస్తున్న వాటాను ప్రిఫ‌రెన్షియ‌ల్ ప‌ద్ధతిలో జ‌స్ట్ డ‌యిల్ కేటాయించ‌నుంది.

About Author