సార్ మీ కాళ్లు మొక్కుతా..న్యాయం చేయండి
1 min readడబ్బు ఇచ్చిన వాళ్లకే న్యాయం చేస్తారా..
మిడుతూరు తహసిల్దార్ కార్యాలయంలో రైతు..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): సార్ మీ కాళ్లు మొక్కుతా మాకు న్యాయం చేయండి అంటూ ఓ వృద్ధుడు తహసిల్దార్ కార్యాలయంలో అంటూ ఉంటే అక్కడున్న వారందరికీ నంద్యాల జిల్లా మిడుతూరు మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆశ్చర్యం కలిగించింది.వివరాల్లోకి వెళ్తే మిడుతూరు మండల పరిధిలోని సుంకేసుల గ్రామానికి చెందిన గోపాలం వెంకటన్నకు 5 ఎకరాల పొలం ఉంది.ఈయనకు పెద్ద వెంకటేశ్వర్లు,బాబు, జక్కరయ్య,సంజీవ నలుగురు కుమారులు వీరిలో పెద్ద కుమారుడైన వెంకటేశ్వర్లు తన తల్లి సంజమ్మకు మరియు కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఐదు ఎకరాలను వెంకటేశ్వర్లు పొలం ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నాడు.దీనిపై కుటుంబ సభ్యులకు తెలియకుండానే మీరు ఏ విధంగా ఆన్లైన్ చేస్తారని తహసిల్దార్ శ్రీనివాసులు మరియు రెవెన్యూ సిబ్బందిపై గ్రామానికి చెందిన గోపాలం సంజీవ, దేవమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంకటేశ్వర్లు మీద చేసిన పొలాన్ని తల్లి సంజమ్మ పేరు మీదికి మార్చాలని గత ఐదు సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం 5 సార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లిన ఫలితం లేదని అసహనం వ్యక్తం చేశారు.మీకు డబ్బులు ఇచ్చిన వాళ్లకే మీరు పనులు చేస్తారు కార్యాలయానికి వస్తే ఒక అధికారి ఉంటే ఇంకో అధికారి ఉండరు వాళ్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ప్రజలకు అందుబాటులో ఉండరు మా తండ్రి పొలాన్ని తల్లి సంజమ్మ పేరు మీదికి మార్చండి అని ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోరు మాకు ప్రాణం భిక్ష అయినా పెట్టండి సార్ అంటూ వృద్ధుడు సంజీవ తన టవల్ ను జోలె పడుతూ రెండు చేతులు జోడించి తహసిల్దార్ కు మొక్కారు. రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే అధికారులకు సెలవులు ఇస్తే వారి స్థానంలో మరో అధికారికి ఇంచార్జి ఇవ్వరు మేము ఎన్ని రోజులు ఇలా కార్యాలయం చుట్టూ తిరగాలని మండల ప్రజలు రెవెన్యూ అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా వారు తీరు మారేనా మరి వేచి చూడాలి.