24 గంటల్లోనే లక్ష బుకింగ్ లు !
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ సంస్థ ఓలా అధ్బుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసిన 24 గంటల్లోనే లక్ష మంది కస్టమర్లు బుక్ చేసుకున్నారని ఓలా సంస్థ తెలిపింది. జులై 15వ తేదిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ ప్రారంభమైంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఇంకా ప్రకటించలేదని సంస్థ తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్. కామ్ లో 499 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించి ఈ స్కూటర్ బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.