ప్రతిపక్షంలో నీతి కబుర్లు.. ఇప్పుడు పన్నులు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ధ్వజమెత్తారు. వ్యాట్, అదనపు వ్యాట్, సుంకం పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతి కబుర్లు చెప్పిన జగన్… అధికారంలోకి వచ్చాక డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించడంలేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల పెట్రోల్ బంకుల్లో ఏపీ కంటే తక్కువ ధర అని బోర్డులు పెట్టారని చెప్పారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పన్నుల భారం తగ్గించి తక్కువ ధరకే అందించాలని డిమాండ్ చేశారు.