భారత సంతతి పై దాడులు
1 min readపల్లెవెలుగు వెబ్ : దక్షిణాఫ్రికాలో అల్లర్లు పేట్రేగిపోతున్నాయి. భారత సంతతి ప్రజలే లక్ష్యంగా అల్లరిమూకలు దాడులు చేస్తున్నారు. భారత సంతతి వ్యాపార, వాణిజ్య దుకాణాల పై దాడులు చేస్తున్నారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా అరెస్టుకు నిరసనగా జరిగిన అల్లర్లలో ఇప్పటి వరకు 117 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో అధికంగా భారత సంతతి ప్రజలే ఉన్నారు. దాడుల్ని అడ్డుకోవాల్సిన పోలీసులే అల్లరి మూకల్ని ప్రోత్సహిస్తున్నట్టు భారత సంతతి ప్రజలు ఆరోపిస్తున్నారు. అల్లరి మూకల నుంచి కాపాడుకునేందుకు ఆయుధాల్ని కొనుగోలు చేస్తున్నారు. తమ పై దాడి చేస్తే ఆయుధాలతో ప్రతిదాడి చేస్తామని భారత సంతతి వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరు అల్లర్ల బాధితులుగా మారారు. తమ పై జరుగుతున్న దాడుల నివారణకు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని భారత సంతతి ప్రజలు కోరుతున్నారు.