బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు,రేపు భారీ వర్షాలు
1 min readపల్లెవెలుగు వెబ్: వాయివ్య బంగాళాఖాతంలో ఈనెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం తూర్పు-పడమర ద్రోణి ఉత్తర అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర , తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా తీర ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. శనివారం అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. ఆదివారం కూడ పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.