నేటి నుంచి తెలంగాణ థియేటర్లు ఓపెన్
1 min readసినిమా డెస్క్ : కరోనా సెకెండ్ వేవ్ తో మూతపడిన థియేటర్లు నేటి నుంచి తెరచుకోనున్నాయి. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, థియేటర్ల యాజమానులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. గత ఏడాదిగా థియేటర్లు మూతపడటంతో నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రిని కోరారు. ముఖ్యంగా మూసి ఉంచిన సమయానికి ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో వెహికిల్స్ పార్కింగ్ చార్జీ వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని, ఎస్జీఎస్టీ ట్యాక్స్‌ను రద్దు చేయాలని, జీవో 75ను పునరుద్దరించాలని, షూటింగు అనుమతులకు వసూలు చేసే చార్జీలను తగ్గించాలని మంత్రికి వినతి పత్రం అందించారు. వీటిపై తలసాని ఇచ్చిన హామీతో థియేటర్ల యాజమానులు ఈరోజు నుంచి షోస్ వేయడానికి అంగీకరించారు.