NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్లో ఆర్​యూ విద్యార్థులు ప్రతిభ

1 min read

10వేల రూ. నగదు బహుమతి అందుకున్న సిఎస్​ఈ డిపార్టుమెంట్ విద్యార్థులు

అమరావతి, న్యూస్​ నేడు: అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్లో రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రతిభచూపడంపట్ల వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకట బసవరావు హర్షం వ్యక్తంచేశారు. అనంతపురం JNTUA లో ఈనెల 11.09.2025వ తేదీన అనంతపురం కర్నూలు జిల్లాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచి 10వేల రూపాయల నగదు బహుమతి అందుకున్న సిఎస్​ఈ డిపార్టుమెంట్ విద్యార్థులు షేక్ బషీద్, సుప్రియ, లోకేష్, ఈశ్వర్, సుమేరా, దర్శన్‌లను ఆయన అభినందించారు. ఈ విద్యార్థులందరూ త్వరలో అమరావతిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారన్నారు. దాంతోపాటు విద్యార్థుల్లోని కోడింగ్ నైపుణ్యాలకు సంబంధించి నిర్వహించిన పోటీలో యూనివర్సిటీ విద్యార్థి షేక్ బషీద్ ఐబిఎం ల్యాబ్‌లో పనిచేసే అవకాశాన్ని దక్కించుకోవడం వర్సిటీకి గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ రకమైన పోటీల్లో పాల్గొనడంద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవచ్చని వి.సి. హితవు పలికారు. ఈ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దిన సిఎస్​ఈ విభాగ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ వి. సతీష్ కుమార్‌ను ఆచార్య బసవరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడు, సిఎస్​ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ వి. సతీష్ కుమార్‌తో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author