ఏలూరు మెడికల్ కాలేజీకి రెండేళ్లు
1 min read

కాలేజీలోనే కేక్ కట్ చేసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు
వైయస్ జగన్ హయాంలోనే ఏలూరు మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి
2023 నుంచి క్లాస్‌లు కూడా ప్రారంభం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లాలోనే అసలు మెడికల్ కాలేజీనే అక్కడ కట్టలేదనేలా టీడీపీ నేతలు గత వారం రోజులుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.దాంతో మెడికల్ కాలేజీ ఆవరణంలోనే కేక్‌ను కట్ చేసిన ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్, కోటారు అబ్బాయి చౌదరి మెడికల్ ఉందన్న సంగతి కూటమి నాయకులకు తెలియజేశారు, నగర అధ్యక్షులు గుడిదేసి శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నుకపెయ్యి సుధీర్ బాబు,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నేరుసు చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్,జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్,రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ఇమ్మాన్యుయేల్ జైకర్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయ నిర్మల, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనుపనూరి జగదీష్, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్ బాబు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు డింపుల్ జాబ్ ,నగర లీగల్ సెల్ అధ్యక్షులు తంబి, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బోగాది ప్రభాకర్ తదితర వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

