NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ భాష హిందీని గౌరవించడం మన సంస్కృతులను గౌరవించుకున్నట్టే

1 min read

డా:సిస్టర్ మేరీ సునీల రాణి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జాతీయ భాష హిందీని గౌరవించడం మన సంస్కృతి వారసత్వాలను గౌరవించుకున్నట్లే అని డాక్టర్: సిస్టర్ సునీల రాణి అన్నారు. స్థానిక సెయింట్ థెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో సోమవారం నిర్వహించిన హిందీ భాషా దినోత్సవ వేడుకలలో కళాశాల ఉప ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీల రాణి పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా మాట్లాడుతూ ఆమె హిందీ భాష చాలా సరళమైన భాష, దానిని నేర్చుకొని ప్రయోగించడం. మన సంస్కృతిని గౌరవించడమేనని అన్నారు.1952 అక్టోబర్ నెలలో డాక్టర్:లక్ష్మణ స్వామి మొదలియార్  అధ్యక్షతన ఏర్పడిన మొదలియార్ కమిషన్ హిందీ తర ప్రదేశాల్లో హిందీ భాష అధ్యయనం యొక్క ప్రాముఖ్యతపై తీర్మానం చేసిందని తెలియజేశారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం విద్యార్థులు హిందీ భారత్ మాకి బింది అంటూ చేసిన నృత్యం అందరినీ అలరించింది. అనంతరం బీబీఎ  మూడవ సంవత్సరం విద్యార్థిని కుమారి జ్ఞానీ జైన్ హిందీ యొక్క ప్రాముఖ్యత, సమాజంపై హిందీ భాష ప్రభావం,హిందీ భాష ద్వారా ఉపాధి అవకాశాలపై చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జ్ఞాన దాయకంగా సాగింది. కార్యక్రమ నిర్వాహకులు హిందీ తెలుగు విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ వి.మహాలక్ష్మి, అధ్యాపకులు వై.అరుణ ఝాన్సీ రాణి, డాక్టర్ కె. అరుణ మరియు శ్రీ జానీ ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్: సిస్టర్ మెర్సీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్: సిస్టర్ సునీలరాణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్: సిస్టర్ సుశీల మరియు ఇతర అధ్యాపకులు అభినందించారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.

About Author