ఏపీ పై సవతి తల్లి ప్రేమ : విజయసాయి రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశామని తెలిపారు. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి.. అందినకాడికి అమ్మేయడం సరికాదన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం ఉద్దేశపూర్వకంగా కేంద్రం విడుదల చేయలేదని అన్నారు. ఏపీపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ, పక్షపాత ధోరణి అని విమర్శించారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా అని ప్రకటించి.. ఏపీకి ఎందుకివ్వరని అడిగామని తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం పై కేంద్రం వైఖరి దుర్మార్గమని అన్నారు.