జనవరి నుంచి ఏటీఏం చార్జీల మోత !
1 min readపల్ల వెలుగు వెబ్ : జనవరి నుంచి ఏటీఎం చార్జీల మోత మోగనుంది. ప్రస్తుతం బ్యాంకులు ఒక్కో అదనపు లావాదేవీకి 20 రూపాయలు వసూలు చేస్తున్నాయి. నెలవారీ ఉచిత లావాదేవీలకు మించి చేసే నగదు, నగదేతర లావాదేవీలపై చార్జీలు పెంచుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఉచిత నగదు లావాదేవీలకు మించి చేసే లావాదేవీలపై 21 రూపాయలు వసూలు చేయనున్నారు. ఏటీఏంల నిర్వహణ ఖర్చు పెరగడం, ఇంటర్ ఛేంజ్ ఫీజులు పెరగడంతో ఆర్బీఐ బ్యాంకులకు ఈ వెసులుబాటు కల్పించింది. సొంత బ్యాంకు ఏటీఎం నుంచి ప్రతినెల 5 ఉచిత నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.