అమరావతి భూములు.. సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి షాక్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలతో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ వినిత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే, మెహపూస్ నజ్కి వాదనలు వినిపించగా.. ప్రతివాదుల తరపున పరాస్ కుహాడ్, శ్యామ్ దివాన్, సిద్ధార్థ లుథ్రా ధర్మాసనం ముందు వాదనలు ఉంచారు.