నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు : పవన్ కళ్యాణ్
1 min read
పల్లెవెలుగు వెబ్ : జగన్ మాటకు.. ఆచరణకు పొంతనలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఎన్నికల సమయంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో.. లక్షల మంది నిరుద్యోగ యువత ఓటేసి వైసీపీ గెలిపించారని ఆయన అన్నారు. ఇప్పుడు కేవలం 10వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చారని తప్పుబట్టారు. మోసపోయాం, వంచనకు గురయ్యామనే ఆవేదనలో యువత ఉందని అన్నారు. లక్షల మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందని, నిరుద్యోగుల ఆందోళనకు జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.