NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమ‌రావ‌తి పై దుష్ప్రచారం మానుకో జ‌గ‌న్ : అచ్చెన్న

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సుప్రీం కోర్టు తీర్పుతోనైనా జ‌గ‌న్ అమ‌రావ‌తి పై దుష్ప్రచారం మానుకుని.. ప్రజా రాజ‌ధానికి స‌హ‌క‌రించాల‌ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హిత‌వు ప‌లికారు. అమ‌రావ‌తి భూముల విష‌యంలో ఎలాంటి ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌ర‌గ‌లేద‌ని సుప్రీం కోర్టు కూడ తేల్చి చెప్పింద‌ని అన్నారు. సుప్రీం తీర్పుతో రాజ‌ధాని రైతులు స్వచ్చందంగా భూములిచ్చారన్న విష‌యం స్పష్టమైంద‌ని ఆయ‌న అన్నారు. రాజధాని విష‌యంలో ముఖ్యమంత్రి తీరు మార్చుకోక‌పోతే మూల్యం చెల్లించుకోక త‌ప్పద‌న్నారు. అమ‌రావ‌తి నిర్మాణానికి స‌హ‌క‌రిస్తాన‌ని మాట ఇచ్చి.. అధికారంలోకి రాగానే మాటెందుకు మార్చార‌ని విమ‌ర్శించారు. ఎలాంటి ఖర్చు లేకుండా అమ‌రావ‌తి నుంచి పాల‌న సాగించే అవ‌కాశం ఉన్నా.. మూడు రాజ‌ధానుల పేరుతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశార‌ని అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు.

About Author