నరసమ్మను గెలిపించండి..
1 min read
ప్రచారంలో పాల్గొన్న ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం
– సమస్యలన్నీ పరిష్కరిస్తాం..
–ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం
పల్లెవెలుగు, కర్నూలు
నగరంలోని 47వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన నరసమ్మను గెలిపించాలని ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం ప్రజలను కోరారు. శుక్రవారం ఉదయం ఆ వార్డులో ఎన్డబ్ల్యూపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా హసీనాబేగం మాట్లాడుతూ నర్సమ్మను సంపూర్ణ మెజార్టీతో గెలిపిస్తే.. వార్డులో సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారంతోపాటు నీరు, రోడ్లు, లైట్లు తదితర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థి నర్సమ్మకు బ్రష్ గుర్తు వచిచందని, ఈ నెల 10న జరిగే పోలింగ్లో బ్రష్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం అభ్యర్థించారు. ప్రచారంలో నేషనల్ ఉమెన్స్ పార్టీ మహిళా వింగ్ ప్రెసిడెంట్ ఎన్ మేరీ, కొత్తపేట ఇంచార్జ్ ప్రసన్న, యూత్ ప్రెసిడెంట్ ఇంతియాజ్, మరియు కార్యకర్తలు విజయమ్మ, ఎస్ సుజాత తాండ్రపాడు, బి సుజాత గాంధీనగర్, సురేఖ, సిమ్రాన్, అనిత పాల్గొన్నారు.