PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు ‘కిమ్స్’లో అరుదైన గుండె శస్త్ర చికిత్స

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు జిల్లాలోని కిమ్స్​ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న యువతికి సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి ప్రాణాలు కాపాడారు. అనంతపురం జిల్లా.. మోమినాబాద్​కు చెందిన గృహిణి షేక్​ జబీనా తబస్సుమ్​(22) అనే మహిళ వారం రోజుల నుంచి ఛాతి, వెన్నునొప్పితో బాధపడుతూ రెండు నెలలుగా ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది పడుతోంది. కుటుంబీకులు ఆమెను చికిత్స నిమిత్తం కిమ్స్​ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు వాల్వ్యులర్​ గుండె వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. కిమ్స్​ కన్సల్టెంట్​ కార్డియాలజిస్ట్​ డాక్టర్​ అలీసౌదగర్​, అనస్థీషియా డాక్టర్​ విజయసాయి సహకారంతో గుండె శస్ర్తచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్ర చికిత్స అనంతరం పేషెంట్​ను 8 రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి ఆమె దినచర్యలు సక్రమంగా చేసుకుంటూ హుషారుగా ఉండటంతో డిశ్చార్జి చేసినట్లు కిమ్స్​ ఆస్పత్రి కన్సల్టెంట్​ కార్డియోథొరాసిక్​ అండ్​ వాస్క్యులర్​ సర్జన్​ డాక్టర్​ కె. సందీప్​ రెడ్డి తెలిపారు. జబీనా తబుస్సమ్ ప్రాణాలు కాపాడిన కిమ్స్​ ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లకు, వైద్యసిబ్బందికి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

About Author