ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన
1 min readపల్లెవెలుగు వెబ్ : ఈనెల 23న బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయివ్య బంగాళఖాతం పరిసరాల్లో ఇది ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 40, 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరంలో జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.