కేంద్రం నిర్ణయం హర్షణీయం
1 min read– రాష్ట్రంలో 11 రహదారులను.. జాతీయ రహదారులుగా గుర్తించింది..
– టీడీపీ, వైసీపీ.. దొందు..దొందే..
– బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ పార్థసారథి వాల్మీకి
పల్లెవెలుగు, కర్నూలు
రాష్ట్రంలో ని 11 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా కేంద్రం గుర్తించిందని, అందులో 8 రాయలసీమలో ఉండటం విశేషమన్నారు బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ పార్థసారథి వాల్మీకి. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాళింగి నరసింహ, వెంకటహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధిని కేంద్రం పట్టించుకోలేదని విమర్శించే వారికి .. కేంద్రం నిర్ణయమే బుద్ధి చెప్పినట్లవుతుందన్నారు. సీమ అభివృద్ధికి టీడీపీ, వైసీపీ.. రెండు చేసిందేమీలేదన్నారు. కర్నూలులో హైకోర్టు పై రెండు పార్టీలకు చిత్త శుద్ది లేదన్నారు. కేంద్రం మద్దతు లేకుండానే.. చంద్రబాబు అభివృద్ధి చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కర్నూలు జిల్లాలో ఏయిర్ పోర్టు, మెగాపార్కు, సోలార్ పార్క్, ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలు స్మార్ట్ సిటీ లాంటివన్ని కేంద్రం నిధులతోనే జరిగాయన్నారు.
ఓటు అడిగే హక్కు.. ఆ పార్టీలకు లేదు..
కర్నూలు లో హైకోర్టు పెట్టకుండా అమరావతి లో ఎర్పాటు చేసింది చంద్రబాబు కాదా.. అని ప్రశ్నించిన.. డా. పార్థసారధి.. రాయలసీమను టీడీపీ, వైసీపీ రెండూ మోసం చేశాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు.. ఆ పార్టీలకు లేవన్నారు.
బీజేపీ అభ్యర్థులను గెలిపించండి..
అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి మాట్లాడుతూ జిల్లాలో మున్సిపల్, కార్పొరేషన్ బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మేనిపెస్టో తయారు చేసి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం లో కేంద్ర ఇచ్చే నిధుల గురించి వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈనెల 7న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు కర్నూలు కార్పొరేషన్ , గూడురు పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.