కృష్ణమ్మ ఒడిలో సంగమేశ్వరుడు
1 min readపల్లెవెలుగు వెబ్ : కర్నూల్ జిల్లా, కొత్తపల్లి మండలంలో వెలసిన సప్త నదుల సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టు ముట్టాయి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకోవడం తో బుధవాం ఆలయ గర్భాలయం జలాధివాసం అయింది. ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ వేపదార శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవాఆరం తొలిఏకాదశి కావడంతో చివరిసారిగా శివుడిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. సంగమేశ్వరుడు ప్రతి ఏడాది ఎనిమిది నెలలు పాటు నీటమునిగి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. ఈ సంవత్సరం మార్చి 21న సంగమేశ్వరం ఆలయం జలాధివాసం వీడి నాలుగు నెలల పాటు భక్తులకు దర్శనమిచ్చింది.