కత్తులు, కర్రలతో మహిళలు.. ఇంట్లో దాక్కున్న మగాళ్లు !
1 min readపల్లెవెలుగు వెబ్ : రాజస్థాన్ లో మహిళలు ఆయుధాలు చేతపట్టారు. కాళ్లకు గజ్జెలు కట్టి.. అపర కాళీలా రోడ్లపై స్వైర విహారం చేశారు. అరుపులు, కేకలతో రెచ్చిపోయారు. ఇంత జరుగుతుంటే.. ఆ ఊరి మగాళ్లు ఇళ్లల్లో దాక్కున్నారు. ఇదంత ఎందుకు చేస్తున్నారంటే.. దేవేంద్రుడిని బెదిరించేందుకేనని వారు చెబుతున్నారు. రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లోని మూడు, నాలుగు గ్రామల్లో ఇలాంటి ఆచారం ఉందట. ఈ ఆచారం 70,80 ఏళ్ల నుంచి వస్తోందట. భూమిపైన దేవతలను పూజిస్తారు. దేవతలకు రాజు దేవేంద్రుడు. వర్షాలు కురవకపోతే.. ప్రజలు కరువు బారినపడతారు. ఒకరినొకరు చంపుకుంటారు. ఆకలితో చస్తారు. దొంగతనాలు, దోపిడీలు చేస్తారు. కాబట్టి మనుషులకు దేవతలపై నమ్మకం పోకుండా ఉండాలంటే .. వర్షాలు కురిపించాలి
అని మహిళలు పంపించే సారాంశం ఇదని గ్రామస్థులు చెబుతున్నారు.