గర్భిణీల ఆరోగ్య సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజీ లెక్చరర్ గ్యాలరీలో ప్రమాదకర చిహ్నాలు కల గర్భిణీ ల ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ మరియు ట్రాకింగ్ పై పట్టణ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వార్డ్/గ్రామ మహిళా ఆరోగ్య కార్యకర్తలకు మూడవ బ్యాచ్ ఒక రోజు శిక్షణ కార్యక్రమము నిర్వహించినారు,ఈ శిక్షణలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శాంతికళ మాట్లాడుతూ గర్భవతులను 8 వారాల లో గుర్తించి నమోదు చేసుకొని నాలుగు సార్లు ఆరోగ్య పరీక్షలు చేసి వారిలో రక్తపోటు,మధుమేహం ,కిడ్నీ వ్యాధులు, క్షయ,గుండె జబ్బులు,మూర్ఛ,హెపటైటీస్ – బి, మలేరియా జ్వరము,గతంలో గర్భములను కోల్పోవడము, కవల పిల్లలు,ప్రసూతికి సంబందించిన శస్త్ర చికిత్స మొదలైన ప్రమాదకర చిహ్నాలుగల ప్రతి గర్భిణి చరిత్ర తెలుసుకొని మాతా శిశు సంరక్షణ కార్డులో పొందుపరచాలని ,ఈ విషయాలను వైద్యాధికారి దృష్టికి తీసుకొనివేల్లి సమయానుసారంగా ఉన్నత శ్రేణి ఆసుపత్రులకు రెఫెర్ చేసి అవసరమైన ఆరోగ్య సేవలు అందునట్లు చూడాలని తెలియజేశారు. అంతేకాకుండా శిశువులకు పుట్టినప్పటి నుండి 5 సంII వరకు సమయానుసారంగా ఇవ్వవలసిన వ్యాదినిరోదక టీకాలను అంగన్వాడి సిబ్భంది సహకారంతో వంద శాతం అందునట్లు చూడాలని ఆదేశించారు. ఈ శిక్షణలో రాష్ట్ర స్థాయి శిక్షకులు డాక్టర్.ప్రియాంకా ,డాక్టర్.శివప్రసాద్ ,డాక్టర్.అను దీప్తిపవర్ పాయింట్ ప్రేసెంటేషన్ ద్వారా గర్భిణీల్లో ప్రమాదకర పరిస్థితులను ముందుగానే అంచనా వేసి క్షేత్రస్థాయి నుంచి రెఫెర్ చేసి స్పెసలిస్ట్ వైద్యుల స్థాయి వరకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్షుణ్ణoగా తెలియజేశారు.ఈ కార్యక్రమములోడిపిహెచ్‌ఎన్‌ఓ కే.అన్నపూర్ణ , ప్రశాంత్ స్టేట్ ప్రోగ్రాం కొర్డినేటర్, డెమో శ్రీనివాసులు , ఎస్‌ఓ.హేమసుందరం , , ఆరోగ్య విద్యా బోదకురాలు పద్మావతి , పిహెచ్‌ఎన్ మీనాక్షి, ఎంపిహెచ్‌ఈఓ శ్రీనివాస మూర్తి మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.