PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు..

1 min read

సినిమా డెస్క్​ : తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్న కోలీవుడ్‌ నటుడు విశాల్‌కు నిన్న షూటింగ్‌ స్పాట్‌లో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన నటిస్తున్న 31వ చిత్రం ‘నాట్‌ ఏ కామన్‌ మేన్‌’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. క్లయిమాక్స్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్స్‌ సీన్స్‌ను షూట్‌ చేస్తున్నారు. ఫైటింగ్‌ సీన్స్‌లో విశాల్‌ వెనుక ఉన్న గోడను బలంగా ఢీ కొట్టడంతో ఆయన వెన్నుముక, చేయి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వైద్యులు చికిత్సనందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని టీమ్‌ సభ్యులు తెలిపారు. గతంలోనూ ఈ సినిమా షూటింగ్‌ విషయంలో విశాల్‌ గాయపడ్డారు. శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విశాల్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. విశాల్‌ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మాధ్యమాల్లో వైరలవుతోంది.


About Author