వైభవం.. నామకరణోత్సవం..
1 min readపల్లెవెలుగు, గద్వాల: హిందూ సాంప్రదాయం ప్రకారం.. పుట్టిన శిశువుకు బారసాల( నామకరణం), అక్షరాభ్యాసం.. వంటి కార్యక్రమాలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారమని పులిపాటి సువర్ణ అన్నారు. స్థానిక గంజిపేట కాలనీలోని తన నివాసంలో బుధవారం సాయంత్రం మనవడి నామకరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద కొడుకు బాలరాజు, కోడలు శారద (ఉమా) దంపతుల కొడుకు (5నెలలు)కు.. మేనత్త రమాదేవి శ్రీహరి అని నామకరణం చేశారు. అంతకు ముందు కీర్తన, కీర్తికకు చెవులు కుట్టారు. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన కార్యక్రమానికి కుల పెద్దలు, బంధువులు, కుటుంబీలు తదితరులు పాల్గొన్నారు.