PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదర్శ రైతుగా ఉప్పలపాటి పెంచలయ్య

1 min read

పల్లెవెలుగు వెబ్​, చిట్వేలి: ఆదర్శ రైతుగా ఎంపిక అయిన ఉప్పలపాటి పెంచలయ్యను శుక్రవారం వై ఎస్ ఆర్ సి పి మండల కన్వీనర్ చెవ్వుశ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో సాంసంన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం చేసి జీవనం సాగించే పెంచలయ్య తన నలుగురి పిల్లలను ఉన్నతంగా చదివించడం అభినందనీయమన్నారు. పెంచలయ్య కష్టాన్ని గమనించిన వ్యవసాయ శాఖ అధికారులు, వైసీపీ నాయకులు సదరు రైతుకు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా రైతు పెంచలయ్య మాట్లాడుతూ పశువులకు వైద్యం వేగంగా అందించడమేకాక… పశువులు చనిపోతే ఇన్సూరెన్స్​ లేకపోయినా ఆ జంతువు ఖరీదు చెల్లించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మేక జయరాం రెడ్డి, సర్పంచ్ ఈశ్వరయ్య, ఎంపీటీసీ చిన్న మిట్టపల్లి రవి, సుబ్బరాయుడు , శీను, దక్ష రాజు, గిరిబాబు, రాజు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author