విశాఖ ఉక్కు కోసం రాజీనామాకు సిద్ధం
1 min readపల్లెవెలుగు వెబ్ : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తెదేపా తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ రాజీనామాకు సిద్ధమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలకు చంద్రబాబు లేఖ రాశారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో 1960లో తెలుగు ప్రజలు విశాఖ ఉక్కును సాధించారని చంద్రబాబు గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పోరాట కమిటీకి చంద్రబాబు పూర్తీ మద్దతు తెలియజేశారు. 2000 సంవత్సరంలో నాటి వాజ్ పేయి ప్రభుత్వం 4వేల కోట్లకు ప్రైవేటీకరించేందుకు సిద్ధపడిందని, తాను వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా విజ్ఞప్తి చేయడంతో .. 1333 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. తర్వాత విశాఖ ఉక్కు లాభాల బాట పట్టేలా చేశామని చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం సీఎం జగన్ నేతృత్వం వహించాలని కోరారు. సీఎం జగన్ ఉక్కు ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని అన్నారు.