NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగవైకల్యం శరీరానికి మాత్రమే.. సంకల్పానికి కాదు

1 min read

ఉమెన్ డెవలప్మెంట్ , చైల్డ్ వెల్ఫేర్ , డిజేబుల్ ఓల్డ్ ఏజ్ , ట్రాన్స్ జెండర్ కమిటీ చైర్మన్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత

కర్నూలు, న్యూస్​ నేడు : అంగవైకల్యం శరీరానికి మాత్రమే.. సంకల్పానికి కాదని  ఉమెన్ డెవలప్మెంట్ , చైల్డ్ వెల్ఫేర్ , డిజేబుల్ ఓల్డ్ ఏజ్ , ట్రాన్స్ జెండర్ కమిటీ చైర్మన్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు.బుధవారం ఉదయం  కలెక్టరేట్ సునయన ఆడిటోరియం లో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉమెన్ డెవలప్మెంట్ , చైల్డ్ వెల్ఫేర్ , డిజేబుల్ ఓల్డ్ ఏజ్ , ట్రాన్స్ జెండర్ కమిటీ చైర్మన్ గౌరు చరిత ( పాణ్యం శాసనసభ్యులు) జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ…అంగవైకల్యం శరీరానికి మాత్రమేనని,  మనసుకు , మీరు సాధించాలని అనుకున్న సంకల్పానికి కాదని తెలుపారు. జిల్లా న్యాయ స్థానం లో ఫోన్ నెంబర్:- 15100 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా విభిన్న ప్రతిభావంతులకు జిల్లా న్యాయ సేవ సాధికారిత సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలు అందుబాటులోకి తీసుకుని వచ్చామని మీ హక్కులకు భంగం కలిగినప్పుడు వీటిని వినియోగించుకోవాలని కోరారు.జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ… విభిన్న ప్రతిభావంతులు ధైర్యవంతులుగా ఉత్సాహవంతులుగా ఉంటారని తెలిపారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు గ్రామాలాలో చిట్ట చివర ఉన్న విభిన్న ప్రతిభావంతులకు కూడా చేరాలని అప్పుడే ఈ సమావేశానికి సార్థకత ఉంటుందని వారు కన్న కలలు సహకారం కావాలని ఆ విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత రెడ్ది , ఏ.డి. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఫాతిమా రయిస్ , డి ఆర్ డి ఏ  పి.డి రమణా రెడ్డి, సి.ఈ.ఓ. సెట్కూరు వేణుగోపాల్ , మెప్మా పి.డి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author