నా కోరిక తీరింది..
1 min readసినిమా డెస్క్ ; ‘‘ఇంతవరకు నేను పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటించలేదు. ఇన్నాళ్లూ అలాంటి అవకాశం కోసం ఎదురుచూశాను. అది ‘రాధేశ్యామ్’ తో నెరవేరింది. మనసుకి సంతృప్తినిచ్చిన ప్రేమకథా చిత్రమిది”అని అంటోంది పూజా హెగ్డే. ‘రాధే శ్యామ్’లో ప్రభాస్‌కు లవర్‌గా ప్రేరణ పాత్రలో కనిపించనుంది పూజ. భావోద్వేగాలకు గురిచేసే వీళ్లద్దరి ప్రేమే సినిమాకి హైలైట్ అట. ఈ సినిమా తర్వాత పూజా గా కాకుండా ప్రేరణగా అభిమానుల మనసుల్లో నిలిచిపోతానని ఎమోషనల్ అవుతోంది పూజ. త్వరలోనే రిలీజ్ కాబోయే ఈ మూవీ కోసం అటు ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్, ఇటు పూజా ఫ్యాన్స్ ఇద్దరూ తెగ వెయిట్ చేస్తున్నారు.